Talli Garbhamunundi
తల్లి గర్భమునుండి జన్మించునప్పుడు
తల్లి గర్భమునుండి ధనము తేడెవ్వడు
వెళ్ళిపొయ్యెడు నాడు వెంట రాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మ్రింగబోడు
లక్షాధికారైన లవణం అన్నమె కాని మెరుగు బంగారంబు మ్రింగబోడు
విత్తమార్జన జేసి విర్రవీగుటె కానీ కూడబెట్టిన సొమ్ము తోడరాదు
పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దానధర్మము లేక దాచి దాచి
తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో, తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో
తేనె జుంటీగలియ్యవా తెరువరులకు
ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు
సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా
While being born from the mother’s womb
From the mother's womb, one does not bring any wealth
Nor does it come along on the day of leaving
Even a millionaire has to eat only salted food, not polished gold
One may gloat over amassed wealth, but the heaped money will not come along
One may hide it well burying it in the earth, and save it without spending on charities
But who knows where it goes in the end - to robbers or rulers?
Don’t bees make honey in the hive but give it away?
What more can I tell you, O pious, noble people assembled here?